బాలయ్య అఖండ 2 లో విలన్ గా మారనున్న బాలీవుడ్ నటుడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు( Actor Balayya Babu )…ఈయన ఇప్పటికే మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తెలుగులో ఎవరికీ సాధ్యం కానీ విధంగా సీనియర్ హీరోలందరికీ పోటీనిఇస్తూ తను భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు.

 Bollywood Actor Who Will Become The Villain In Balayya Akhanda 2, Actor Balayya-TeluguStop.com

ఇక ప్రస్తుతం బాలయ్య బాబు ( Balayya Babu )బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ముఖ్యంగా మిగతా హీరోలందరితో పోల్చితే బాలయ్య మాత్రం సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.ఒక సినిమా సెట్స్ మీద వుండగానే, మరొక సినిమాకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తూ ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఖాళీ లేకుండా మరొక సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతున్నాడు.

 Bollywood Actor Who Will Become The Villain In Balayya Akhanda 2, Actor Balayya-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే అఖండ 2 సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఒక స్ట్రాంగ్ విలన్ ను తీసుకురావాలనే ప్రయత్నంలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాలయ్య సంజయ్ దత్( Sanjay Dutt )ను విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక తనతో పాటు మరొక విలన్ ను కూడా ఈ సినిమాలో భాగం చేయాలని బోయపాటి చూస్తున్నాడు.మరి సంజయ్ దత్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉంటాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

చూడాలి మరి వీరిలో బోయపాటి ఎవరిని తీసుకుంటాడు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube