Ranbir Kapoor Assets : కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన రణ్ బీర్ కపూర్.. ఎన్ని వందల కోట్లంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ( Ranbir Kapoor ) తాజాగా తన 41వ బర్త్డేని గ్రాండ్ గా జరుపుకున్నారు.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న యానిమల్ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Bollywood Actor Ranbir Kapoor Properties Net Worth Value

ఇక ఈ టీజర్( Animal Teaser ) విడుదలైన కొద్ది క్షణాల్లోనే చాలా వైరల్ అయింది.అయితే రణ్ బీర్ కపూర్ బర్త్ డే అవ్వడంతో ఆయన గురించి ఎన్నో రకాల విషయాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.అయితే తాజాగా ఆయన ఎన్ని కోట్లకు అధిపతి అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఇంతకీ రణ్ బీర్ కపూర్ కి ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉంది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Bollywood Actor Ranbir Kapoor Properties Net Worth Value

రణ్ బీర్ కపూర్ కేవలం హీరో గానే కాకుండా పలు వ్యాపార ప్రకటనలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈయన తన ఒక్కో సినిమాకు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్( Ranbir Kapoor Remuneration ) తీసుకుంటారని తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు ఆయన సంపాదించిన మొత్తం ఆస్తి 350 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
Bollywood Actor Ranbir Kapoor Properties Net Worth Value-Ranbir Kapoor Assets :

అలాగే ఈయన దగ్గర లగ్జరీ కార్లు,కోట్ల విలువ చేస్తే స్థిర చరాస్తులు చాలానే ఉన్నాయట.ఇక ఈయన ఒక్కో బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి దాదాపు 5 నుండి 6 కోట్ల వరకు( Ranbir Kappoor Advertisements ) చార్జ్ చేస్తారట.

ఇక రణ్ బీర్ కపూర్ సినిమాల్లో హీరోగా చేయకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేశారు.ఇక మొదటిసారి హీరోగా సావరియా (Saawariya) అనే సినిమాలో చేశారు.

Bollywood Actor Ranbir Kapoor Properties Net Worth Value

అలాగే రణబీర్ కపూర్ కి బాలీవుడ్ లో ప్లే బాయ్ అనే పేరు ఉంది.ఎందుకంటే ఈయన చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ లేడీస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు.అలా ఈయన దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లతో చాలా రోజులు రిలేషన్ లో ఉన్నారట.

ఇక 2022లో అలియా భట్ ( Alia bhatt ) ని పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు