బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు నటుడు అజయ్ దేవగన్( Ajay Devagan ) .ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించినటువంటి ఈయన ప్రముఖ నటి కాజోల్( Kajol ) ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక అజయ్ దేవగన్ ఇప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన భోళా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా సక్సెస్ అనంతరం ఈయన ముంబైలో ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇప్పటికే ముంబైలో ఖరీదైన ప్రాంతాలలో ఎంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే తాజాగా మరోసారి అజయ్ దేవగన్ ఎంతో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ముంబై( Mumbai ) అందేరి వెస్ట్ లో 13293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ అని దానికి మొదటి యూనిట్ 8405 చదరపు అడుగుల బిల్డ్ అప్ ఏరియాని కలిగి ఉంది.ఈ ఆస్తిని ఓషివారా సిగ్నేచర్ భవనంలోని 16వ అంతస్తులో ఉంది.
ఈ ఆస్తి కోసం దాదాపు 35 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ ప్రాపర్టీ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడమే కాకుండా ప్రత్యేకంగా స్టాంప్ డ్యూటీ కోసం అజయ్ దేవగన్1 కోటి 82 లక్షలు చెల్లించారని తెలుస్తుంది.అలాగే ఇదే భవనంలో 17వ అంతస్తులో 14.74 కోట్ల రూపాయలతో మరో రెండు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది.దీనికోసం 88.44 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ గా చెల్లించారని తెలుస్తుంది.ఈ విధంగా అజయ్ దేవగన్ మరోసారి ముంబైలోని అందేరి ప్రాంతంలో సుమారు 45 కోట్ల విలువచేసే ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.







