ముగ్గురు అక్కాచెల్లెళ్లు తప్పిపోయి. చివరికి తమ ఇంట్లో ఉండే ఓ ట్రంక్ పెట్టెలో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషాద ఘటన పంజాబ్ లోని( Punjab ) జలంధర్ జిల్లా కాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కాన్పూర్ గ్రామంలో( Kanpur Village ) వలస కూలీ కుటుంబం నివాసం ఉంటోంది.ఆ కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.ఈ ఐదుగురిలో అమృత కుమారి (9), శక్తి కుమార్ (7), కంచన్ కుమారి (4) ఆదివారం సాయంత్రం అదృశ్యమయ్యారు.
ఆదివారం రాత్రి 8:00 సమయంలో పిల్లలు కనిపించడం లేదని, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలను గాలించారు.పిల్లలు కనిపించకపోవడంతో ఆదివారం రాత్రి 11 గంటలకు మక్సుదాన్ పోలీస్ స్టేషన్లో తమ పిల్లలు తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఆ బాలికల తండ్రి సోమవారం ఇంటికి సంబంధించిన వస్తువులను తరలిస్తూ ఉండగా.ట్రంక్ పెట్టె( Trunk Box ) అధిక బరువుగా ఉండడంతో, పెట్టేను తెరచి చూడగా అందులో ముగ్గురు కుమార్తెలు శవమై కనిపించారు.వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి చుట్టుపక్కల ఉండే స్థానికులను విచారించగా.బాలికల తండ్రి ఇటీవలే తాగుడుకు బానిస అవ్వడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడని తెలిపారు.

ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు( Three Sisters ) ఆడుకుంటూ ట్రంక్ పెట్టెలో దాక్కున్నారు.అయితే ట్రంక్ పెట్టెకు అనుకోకుండా లాక్ పడింది.దీంతో లోపల ఉండే యువతులు ఊపిరి ఆడక మరణించారు,అని పోలీసులు భావిస్తున్నారు.మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ అందిన తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.