మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది.చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం.
తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి.హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది.
పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది.
వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి.ఒకవైపు కాలనీల్లో నీళ్ళు చేరితే యువకులు ఆ నీటిలో ఈత కొడుతూ తమ సరదాలు తీర్చుకుంటున్నారు
.