చుండ్రును తరిమికొట్టే న‌ల్ల ఉప్పు.. ఎలాగో తెలుసా?

సాధార‌ణంగా రోజూవారీ వంట‌ల్లో అధిక శాతం మంది తెల్ల ఉప్పునే వాడుతుంటారు.ఎవ‌రో కొంద‌రు మాత్రమే న‌ల్ల ఉప్పును యూస్ చేస్తుంటారు.

అయితే వాస్త‌వానికి తెల్ల ఉప్పు కంటే న‌ల్ల ఉప్పే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.న‌ల్ల ఉప్పులోనే ఎక్కువ పోష‌కాలు నిండి ఉంటాయి.

ఆరోగ్య ప‌రంగానే కాదు సౌంద‌ర్యానికి, కేశ సంర‌క్ష‌ణ‌కు సైతం న‌ల్ల ఉప్పు ఉయోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి న‌ల్ల ఉప్పు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

న‌ల్ల ఉప్పుతో చుండ్రును సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం న‌ల్ల ఉప్పును జుట్టుకు ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక మ‌గ్ లో వాట‌ర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల న‌ల్ల ఉప్పును వేసి పూర్తిగా క‌రిగించి ప‌క్క‌న పెట్టుకోవాలి.త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత న‌ల్ల ఉప్పు క‌లిపిన నీటిని త‌ల మొత్తం త‌డిచేలా పోసుకుని ప‌ది నిమిషాలు వ‌దిలేయాలి.

ఆపై నార్మ‌ల్ వాట‌ర్‌తో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి ఒక్క‌సారి చేశారంటే న‌ల్ల ఉప్పులో ఉండే ప‌లు సుగుణాలు చుండ్రును క్ర‌మంగా తరిమికొడ‌తాయి.

మ‌రియు త‌ల‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొల‌గించి రక్తప్రసరణను మెరుగ్గా మారుస్తాయి.

ఇక నల్ల ఉప్పు సహజ సిద్ధమైన స్క్రబ్బర్ గా కూడా ప‌ని చేస్తుంది.ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ న‌ల్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని క‌లిపి.ఆ మిశ్ర‌మాన్ని చర్మంపై సున్నితంగా రుద్దాలి.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

రెండు నిమిషాల పాటు స్క్ర‌బ్బింగ్ చేసుకున్న అనంత‌రం నీటితో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.ఇలా వారంలో ఒక‌సారి చేస్తుంటే మొటిమలు, ముడ‌త‌లు, బ్లాక్‌హెడ్స్‌ వంటి సమస్యలు తలెత్త‌కుండా ఉంటాయి.

Advertisement

స్కిన్ ఆరోగ్యంగా, గ్లోయింగ్‌గా మారుతుంది.