పంజాబ్ లో ర్యాపర్ హత్య.. ఎక్కడో ఉన్న సల్మాన్ ఖాన్ కు భారీ భద్రత.. కారణం?

పంజాబ్‌ ర్యాపర్‌, సింగర్‌ సిద్ధూ మూసేవాలా గ్యాంగ్‌వార్‌కు బలైన విషయం తెలిసిందే.అయితే అతన్ను హత్య చేసింది తామేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

 Salman Khan Security Increased After Sidhu Moosewala Murder Details, Salman Kha-TeluguStop.com

ప్రస్తుతం ఈ కేసుపై విచారణ ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియా 2018లో బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ లారెన్స్‌ చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియో మరొకసారి వైరల్‌గా మారింది.కృష్ణ జింకను దైవంగా భావించే బిష్ణోయ్‌ కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని ఏకంగా కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు సల్మాన్‌ హత్యకు ప్లాన్‌ చేసి అతడి ఇంట్లో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.ఇక ఇటీవల తీహార్‌ జైలులోనే ఉండి సింగర్‌ సిద్ధూ ని చంపిన విషయం తెలిసిందే.

చంపిన విషయాన్ని తానే స్వయంగా అంగీకరించాడు.దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు భద్రత మరింత పెంచారు.

పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్యకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Telugu Bollywood, Deers, Lawrencebishnoi, Mumbai, Pubjab, Salman Khan, Salmankha

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హీరో ఇంటివద్ద అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మరి పోలీసులు అనుకుంటున్న విధంగా సల్మాన్ ఖాన్ ను ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారా చూడాలి మరి.అలాగే మరి ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఏ విధంగాస్పందిస్తాడో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube