లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది.ఈ మేరకు ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ లా నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తోంది.
ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చే విధంగా బీజేపీ ప్రణాళిక రచించిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు చేసే కార్యక్రమాలకు బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది.అయితే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా తెలంగాణ బీజేపీ( Telangana BJP ) తీవ్ర కసరత్తు చేస్తుంది.