జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pavan Kalyan ) బిజెపి చాలా ఆశలు పెట్టుకుంది.ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది.
ఆ పొత్తును తెలంగాణకు విస్తరించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ( Jana Sena BJP )ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.
ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలను బిజెపి కేటాయించింది.మొన్నటి వరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ వైఖరిపై కాస్త అసంతృప్తితో ఉంటూ వచ్చిన బిజెపి నాయకులు ఇప్పుడు పవన్ ప్రచారంలోకి దిగడంతో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆశలు పెట్టుకున్నారు.
ఇంకా ఎన్నికల ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది.ఈనెల 28వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
దీంతో బిజెపి అభ్యర్థుల పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదు.దీంతో పవన్ తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలతో విరుచుకుపడతారని బిజెపి వేసిన అంచనా తలకిందులైంది .అయితే ఎన్నికల ప్రచార గడువు సమయం నాటికి కీలకమైన నియోజకవర్గాల్లో పవన్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బిజెపి భావిస్తుంది .అయితే అధికార పార్టీ బి ఆర్ ఎస్ పై విమర్శలు చేసే విషయంలో పవన్ మొహమాటపడుతుండడం , సూటిగా విమర్శలు చేయకుండా పరోక్షంగా విమర్శలు చేస్తూ ఉండడం వంటివి బిజెపి నాయకులకు అసంతృప్తిని కలిగిస్తున్నాయి.అయితే పవన్ బీ ఆర్ ఎస్ ను నేరుగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేయకపోవడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.పవన్ సినీ రంగనికి చెందినవారు కావడం, ఒకవేళ ఇప్పుడు బీ ఆర్ ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసినా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ ఎఫెక్ట్ సినీ రంగంపైనా, తన సినిమాల పైన తీవ్రంగా ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారని బిజెపి అనుమానిస్తోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఏపీ అంశాలను, తెలంగాణ పోరాటాలను ప్రస్తావిస్తూ మాత్రమే పవన్ ప్రసంగాలు చేస్తున్నారు .తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్ఎస్( BRS ) పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారని ఆశలు పెట్టుకున్న బిజెపికి పవన్ వైఖరి మింగుడు పడడం లేదు.ఎన్నికల ప్రచార గడు ముగిసే లోపు అయినా పవన్ బిజెపిని హైలెట్ చేసే విధంగా బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తారని ఆశలతో బిజెపి ఉంది.