తెలంగాణ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ ( BRS )మరియు కాంగ్రెస్ పార్టీల( Congress )తో పోల్చితే బీజేపీ వైఖరి చాలా స్లో అండ్ స్టడీ గా ఉందని చెప్పాలి.మరో 25 రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పటికి ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టడం లేదు కమలనాథులు.
ఆ మద్య జాతీయ నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటనలు చేసి కొంత జోష్ నింపినప్పటికి.ప్రస్తుతం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అసలు బీజేపీలో( BJP ) ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
గత కొన్నాళ్లుగా పార్టీలో ఆయా నేతల కారణంగా ముసలం ఏర్పడిన సంగతి తెలిసిందే.

దీంతో పార్టీని చక్కదిద్దుతూ గాడిన పెట్టేందుకు అధిష్టానం గట్టిగా ప్రయత్నిస్తోంది.ఇక ఇప్పటివరకు మూడు జాబితాల్లో అభ్యర్థుల ఎంపిక జరిపిన అధిష్టానం త్వరలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక్కరిని, మూడో జాబితాలో 35 మందిని ప్రకటించింది కమలం పార్టీ.
ఇక మిగిలిన 31 స్థానాలలో జనసేనతో సీట్ల సర్దుబాటు తరువాత ప్రకటించే అవకాశం ఉంది.ప్రస్తుతం సీట్ల విషయంలో పవన్ తో చర్చలు జరుయిపుతున్నారు కమలనాథులు.రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేనకు 9 సీట్లు కేటాయించేందుకు సిద్దమౌతున్నట్లు టాక్.

ఇకపోతే సిఎం అభ్యర్థి విషయంలోనే అసలు చిక్కుముడి.ఇప్పటికే బీసీలలో ఒకరిని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అమిత్ షా( Amit Shah ) ప్రకటించిన సంగతి తెలిసిందే.దాంతో ఎవరిని సిఎం అభ్యర్థిగా నిర్ణయించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే ఈ నెల 7 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడి( Narendra Modi ) తెలంగాణకు రానున్నారు.హైదరబాద్ లో జరిగే బీసీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
ఈ సభలోనే సిఎం అభ్యర్థి ఎవరనే దానిపై ప్రధాని స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు టాక్.అంతే కాకుండా జనసేనతో పంచుకునే సీట్ల విషయంలో కూడా ఈలోపు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆ తరువాత నుంచి పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూ జాతీయ నేతలు తెలంగాణలోనే మకాం వేసేలా రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.మొత్తానికి బీజేపీ గేర్ మార్చేది ప్రధాని రాకతోనే అన్నమాట.







