చాలా కాలంగా తెలంగాణ పోలీసులు వ్యవహార శైలిపై రాజకీయంగా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని , ప్రతిపక్షాల నోరు నొక్కే విధంగా కేసీఆర్( KCR ) పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తూనే వస్తున్నారు.
తాజాగా ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ( DK Aruna ) ఘాటుగా స్పందించారు.ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, తరుచుగా ఇబ్బంది పెడుతున్న పోలీసులను గుర్తుపెట్టుకోవాలని ఆమె కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అండతో ప్రతిపక్ష నేతలను పోలీసులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అటువంటి వారి సంగతి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని అరుణ అన్నారు.

నాంపల్లి బిజెపి కార్యాలయంలో( Nampally BJP office ) జరిగిన సమావేశంలో మాట్లాడిన అరుణ పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోయినా, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుని పోలీసులు అరెస్టులు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.కామారెడ్డిలో మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి( Chairman Venkataramana Reddy ) విషయంలోనూ పోలీసులు ఇదేవిధంగా వ్యవహరించారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతలను అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ బెదిరింపులకు బిజెపి భయపడదని అన్నారు.కొంతమంది పోలీసులు పింక్ కండువాలు కప్పుకున్న కార్యకర్తలుగా మారారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు .

గతంలో ఉన్న ప్రభుత్వం ఇదేవిధంగా నియంతగా వ్యవహరిస్తే అసలు తెలంగాణ వచ్చేదా అని అరుణ ప్రశ్నించారు.తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికి పాలించే హక్కు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని , పోలీసులతోనే గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామనే అహంకారంతో కేసీఆర్ ఉన్నారని , ఈసారి జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని ఖబడ్దార్ కేసీఆర్ అంటూ అరుణ సవాల్ చేశారు.







