ప్రాంతీయ పార్టీలను వణికిస్తున్న బీజేపీ ద్వయం

2019 సార్వత్రిక ఎన్నికలలో బిజేపిని గద్దె దించడానికి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ప్రధాన అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా కాంగ్రెస్ తో జట్టుకట్టాయి.

దేశంలో మళ్లీ సంకీర్ణ శకాన్ని తీసుకురావాలని ఆ పార్టీలు ప్రయత్నించాయి కాని దీనికి ప్రజలు ఏ మాత్రం అంగీకరించలేదు అందుకే బిజేపికి భారీ విజయాన్ని కట్టబెట్టారు.

తాము చేసిన తప్పుల్ని సరి చేసుకొని జాతీయస్థాయిలో మళ్లీ తమ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్ భావించట్లేదు.అందుకే దేశ వ్యాప్తంగా బిజేపి హవా బ్రేక్ లేకుండా దూసుకుపోతుంది.

Bjp Threatening Local Parties, BJP, Local Parties, Modi Government,Congress Part

రీసెంట్ గా సర్వే సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలో కూడా మోడీ ప్రభుత్వానికి ఆదరణ క్రమ క్రమంగా పెరుగుతుంది.ఇది ఏ మాత్రం ప్రాంతీయ పార్టీలకు రుచించట్లేదు.

ఇప్పటికే దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో రెండు లేదా మూడో స్థానానికి చేరిన బిజేపి ప్రస్తుతం ఆయా రాష్ట్రాలలో పాగా వేయడానికి అధిష్ఠానం నిర్ణయించిన ఇంచార్జ్ పర్యవేక్షణలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలలో అధికార పార్టీగా కొనసాగుతున్న బిజేపి తమ అధికారానికి ఎక్కడ గండి కొడుతుందో అని భయపడిపోతున్నాయి.

Advertisement

సగం ఆ భయంతోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలు 2019 ఎన్నికలలో కాంగ్రెస్ తో జత కట్టాయి.వేగంగా ప్రజల ఆదరణను సొంతం చేసుకుంటున్న బిజేపికి కళ్లెం వేయడానికి ప్రాంతీయ పార్టీలు ప్రశాంత్ భూషణ్ వంటి వారి సహాయం కోరుతున్నాయి.

ప్రస్తుతానికి కొన్ని మిత్రపక్షాలతో బిజేపి ముందుకెళ్తున్న త్వరలో దేశం మొత్తంలో జరిగే ఎన్నికలలో సింగిల్ పార్టీగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు