ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో ఇప్పటి నుంచే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఏపీలో జరిగే పరిణామాలు చూసుకుంటే రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.శత్రువులు ఉండరన్న విషయం తెలిసిందే.
ఇక మొన్నటి వరకు జగన్ తో సఖ్యతగా ఉన్న బీజేపీ ప్రస్తుతం టీడీపీ వైపు యూటర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కేంద్ర బీజేపీ పెద్దలు తమ మనసు మార్చుకున్నారు.
తమకు అధికారం కావాలి.పైగా ఉత్తరాదిన ఈసారి కావాల్సిన సీట్లు కొరతా పడతాయని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో సౌత్ వైపు వారు ఫోకస్ పెట్టారు.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీ పెద్దలకు సరికొత్త ఆశలను పెంచుతున్నాయి.తెలంగాణలో ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా బీజేపీ దూకుడు పెంచుతోంది.ఇక్కడ అన్ని అవకాశాలు వాడేసుకుని తామే కొత్త సర్కార్ ఏర్పాటు చేయలనుకుంటోంది.దానికి నాందిగా అమిత్ షా తాజా టూర్ లో మీడియా దిగ్గజం రామోజీరావుని ప్రత్యేకంగా కలిశారు.
ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో మీట్ అయ్యారు.ఈ రెండూ కూడా ఇండైరెక్ట్ గా టీడీపీకి కలసివచ్చేవే అంటున్నారు.
ఇక ఏపీ వరకూ చూస్తే జగన్ విషయంలో ఎందుకో దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే జగన్ తో ఎన్నికల పొత్తులకు కుదరదు.
ఇక మూడు రాజధానులతో మొదలు పెట్టి ఏపీ అప్పుల కథతో చాలా వరకూ దూకుడు పెంచిన తీరుతో కేంద్ర పెద్దలకు జగన్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అంటున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ వస్తారా… అన్న దాని మీద కూడా డౌట్లు ఉండి ఉంటాయి.ఒక వేళ జగన్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆయనకు కేసీఆర్ తో ఉన్న దోస్తీ కారణంగా బీజేపీయేతర కూటమికి మద్దతు ఇస్తారేమో అన్న డౌట్లు కూడా ఉన్నాయట.ఏ రకంగా చూసినా ఎన్నికల్లో పొత్తు రూపంలో సీట్లు రావు.
ఇలా జగన్ విషయంలో చాలా డౌట్లు పెట్టుకున్న బీజేపీ ఆయన కంటే బాబు బెటర్ అనుకుంటోందిట.బాబు అయితే అటు తెలంగాణ ఇటు ఏపీ రెండూ సరిచూసుకోవచ్చని భావిస్తోందట.
అంతే కాకుండా ఒక పవర్ ఫుల్ సామాజికవర్గం తమ వెంట వస్తుందని అంచనా వేస్తోందట.

అలాగే బడా మీడియా మద్దతు కూడా ఫుల్ గా దక్కుతుందని.సినీ గ్లామర్ పరంగా చూసినా బాబు సైడ్ ఉంటేనే తమకు దక్కుతుంది అన్న లెక్కలు వేసుకునే బాబుని తమ వైపునకు తిప్పుకునేందుకు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది.అందుకే కుప్పంలో బాబు టూర్ లో భద్రతాపరమైన లోటు పాట్లు ఉన్నాయని తెలియడంతో ఆయనకు హుటాహుటిన కేంద్రం భద్రతను 12 ప్లస్ గా పెంచేసిందట.
దీంతో బాబుకు ఢిల్లీ ఫుల్ సపోర్ట్ అనే అర్థమవుతోంది అంటున్నారు.బాబు భద్రత మీద డీజీఐ నేతృత్వంలోని ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు ఇంటిని టీడీపీ ఆఫీసును పరిశీలించించింది.
ఇక కేంద్రం సైతం ఆలస్యం చేయకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీని భారీగా పెంచేసి బాబును హ్యాపీ అయ్యేలా చేసింది.
ఈ పరిణామాలతో కుప్పంలో అసలైన షాక్ జగన్ కే తగిలింది అంటున్నారు.
ఇప్పుడు కుప్పంలో బాబుకు దొరికిన సపోర్ట్ చూసుకుంటే.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబుని వెన్నంటి కేంద్ర బీజేపీ ఉంటుందన్న స్పష్టమైన సందేశం కూడా పంపించినట్లు ఉందని అంటున్నారు.
ఇక వీటన్నింటికి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.