కే‌సి‌ఆర్ కు పోటీగా ఆ ఇద్దరు ?

తెలంగాణలో ఎన్నికల( Telangana Elections ) వేడి తారస్థాయిలో కొనసాగుతోంది.

ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.

ఇక అధికార బి‌ఆర్‌ఎస్( BRS ) అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేస్ లో ఒక్క అడుగు ముందే నిలిచింది.కాగా గతంలో కంటే భిన్నంగా ఈసారి కే‌సి‌ఆర్( CM KCR ) రెండు చోట్ల పోటీ చేయనుండడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వెదీక్కాయి.

గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి కే‌సి‌ఆర్ బరిలో దిగనున్నారు.దీంతో ఈ రెండు నియోజిక వర్గాలలో కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జల్లెడ పడుతున్నాయి.

రెండు పార్టీలు ఈసారి కే‌సి‌ఆర్ ను ఒడిస్తామని గట్టిగా చెబుతున్నాయి.దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరుపున ఎవరు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది.అయితే బీజేపీ పార్టీ నుంచి కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Advertisement

గజ్వేల్( Gajwel ) బరిలో కే‌సి‌ఆర్ కు పోటీగా ఈటెల రాజేందర్( Etela Rajender ) నిలబడే అవకాశం ఉంది.ఈసారి ఎలాగైనా కే‌సి‌ఆర్ ను ఒడిస్తానని శపథం చేస్తున్న ఈటెల.

కే‌సి‌ఆర్ కు సరైన ప్రత్యర్థి అని కమలం పార్టీ అధిష్టానం భావిస్తోందట.అటు కామారెడ్డి( Kamareddy ) నుంచి విజయశాంతిని( Vijayashanti ) బరిలో దించితే ఎలా ఉంటుందనే ఆలోచన అధిష్టానం చేస్తోందట.

ఎందుకంటే కే‌సి‌ఆర్ పై బలాబలహీనతలను విజయశాంతి మరియు ఈటెల రాజేందర్ చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అందుకే కే‌సి‌ఆర్ కు పోటీగా ఈ ఇద్దరే సరైనోళ్లని కమలం పార్టీ భావిస్తోందట.అయితే రాములమ్మ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్( Malkajgiri Parliament ) ఆశిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది సందేహమే.

మొత్తానికి కే‌సి‌ఆర్ కు చెక్ పెట్టేందుకు బలమైన నేతలను బరిలో దించే ప్లాన్ లో ఉంది కమలం పార్టీ.మరి అటు కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో బలమైన వ్యక్తులనే ఎంపిక చేసే పనిలో ఉందట.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మరి కే‌సి‌ఆర్ కు పోటీనిచ్చే ప్రత్యర్థులు ఎవరో చూడాలి.

Advertisement

తాజా వార్తలు