బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదానికి కేరళ హాట్ స్పాట్ గా మారిందని అన్నారు.
ఆ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదన్నారు.కుటుంబ పాలన పెరిగిపోతోందన్న ఆయన.సీఎం కార్యాలయం కూడా అవినీతిలో భాగమైందని విమర్శించారు.హింసకు పాల్పడే వారికి అక్కడి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మద్ధతు ఇస్తుందని ఆరోపించారు.







