బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరికాసేపటిలో శ్రీకాళహస్తికి వెళ్లనున్నారు.తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాళహస్తిలోని బేరి మండలం వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఇప్పటికే సభ వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశారు.కాగా జేపీ నడ్డాతో పాటు ఏపీ బీజేపీ ముఖ్య నేతలు బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీలో బీజేపీ నేతలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.







