కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడంటూ తీవ్రంగా విమర్శించారని తెలుస్తుంది.
విదేశాల్లో భారత్‌ను రాహుల్ గాంధీ అవమానించారని మండి పడ్డారు.ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని అన్నారంటే.
భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతోందని విమర్శలు గుప్పించారు.అణగారిన వర్గాల విషయంలో అవమానకరమైన ప్రసంగం చేశారని, ఆయన ఎక్కడికి వెళ్లినా ఓబీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.







