ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ ల నుంచి బిజెపిలో( BJP ) చేరిన నేతలకు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గందరగోళం సృష్టిస్తున్నాయి.కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఉన్న వీరంతా తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని , కేంద్ర బీజేపీ పెద్దలు కేసిఆర్ పై టార్గెట్ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారనే ఆశతో ఇప్పటివరకు ఎదురుచూసిన వారంతా, ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు.
బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే నన్న భావన ప్రజల్లోకి వెళుతుండడం, ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత అరెస్టు జరగకపోవడం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా యాక్టివ్ గా పనిచేస్తున్న సమయంలో బండి సంజయ్ ను( Bandi Sanjay ) తప్పించి కిషన్ రెడ్డికి( Kishan Reddy ) బాధ్యతలు అప్పగించడం తదితర పరిణామాలు అన్నిటిని లెక్కలు వేసుకుంటున్నారు.దాదాపు ఓ పదిమంది కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మీడియా, సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు.బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఎటువంటి నిర్ణయాలు అయినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు.ముఖ్యంగా విజయశాంతి( Vijayashanti ) వంటి వారు తమ అసంతృప్తిని వెళ్ళుతున్నారు.కొంతమంది రహస్యంగా సమావేశాలు నిర్వహించారు.ఈ రహస్య సమావేశాలు వివరాలను మీడియాకు లీకులు ఇస్తున్నారు.బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరించేందుకు బిజెపి రాజకీయాలు చేస్తోంది అని వారు సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాము పార్టీలో చేరింది బీఆర్ఎస్ ను ఓడించడానికి, పార్టీలో చేరేటప్పుడు బీఆర్ఎస్ తో ఎలాంటి లోపాయి కారి ఒప్పందాలు ఉండవని చెప్పారని , కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని వారు ఆవేదన చెందుతున్నారు .ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,( Komatireddy Rajagopal Reddy ) విజయశాంతి వంటి వారు కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు.కానీ ఇప్పుడు బీజేపీలో తాము ఊహించిన దాని కంటే భిన్నమైన వాతావరణం ఉండడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారట.







