కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి చేందాలని స్వామి వారిని ప్రార్ధించా ఈ నెల 13వ తేదీన జరుగుతున్న శాసన మండలి ఎన్నికలకు జరుగుతుంది గతంలో సర్పంచ్, ఎంపీటీసీ,ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసే సాంప్రదాయంను చూసాం.
కొత్తగా ఏపిలో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఓట్లను కొనుగోలు చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం ఎన్నికల సంఘం ఓట్ల కొనుగోలు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి చాలా మంది ఓటర్లకు సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి డబ్బుకు బదిలి చేసే సాంప్రదాయం కొనసాగుతుంది.రాబోయే రోజుల్లో ఇటువంటి సాంప్రదాయం ప్రజాస్వామ్యంకు నష్టం కలిగిస్తుంది.
కఠినమైన నిర్ణయాలతో శాంతిభద్రతలకు ఎటువంటి లోపాలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంను కోరుతున్నాం.ఏపికి పెట్టుబడులు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించరు.
ఏపికి 13 లక్షల కోట్లల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులు మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టింది.పెట్టుబడుల సదస్సు నిర్వహణ అనేది ఎన్నికల దృష్టిలో జరగకూడదు.
గతంలోనూ టిడిపి ప్రభుత్వం పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో తీసుకుని పెట్టింది.లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఏపిలో నిరుద్యోగం తీరి, అభివృద్ధి చేందాలని అందరూ ఆకాంక్షిస్తున్నాం.
గతంలో వచ్చిన పెట్టుబడుల విషయంలో ఎన్ని లక్షల కోట్లు వచ్చిందనే విషయంలో పారదర్శకత లేదు.టిడిపి హయాంలో వచ్చిన పెట్టుబడుల ఒప్పందం సరైనది కాదని అధికారంలో ఉన్న ప్రభుత్వం చెబుతుంది.
మూడేళ్ల క్రితమే పెట్టుబడుల సదస్సు పెట్టింటే మూడేళ్ళ కాలంలో పారదర్శకంగా అభివృద్ధి చేసి ఉండచ్చో.ఒప్పందాల మీద విపక్షాల పార్టిలు అనుమానం వ్యక్తం చేస్తుంది.
ఊరూ పేరు లేని కంపెనీలు కోట్లకు పడగెత్తి లక్షలకోట్లకు రూపాయలు సంపాదించిన అనేక పరిశ్రమలు ఉన్నాయి.వచ్చిన పెట్టుబడులు మూడేళ్ళకు ఒకసారి ప్రజల ముందు పెట్టాలి.
చంద్రబాబు నాయుడు హయాంలో భారత ప్రభుత్వంకు సంబంధించిన కంపెనీలు మాత్రమే పెట్టుబడులు పెట్టాయి.ఆంధ్రప్రదేశ్ ఉన్న పారిశ్రామిక విధానంలో, కంపెనీలకు అనుకూల వాతావరణం ఉంటేనే పరిశ్రమలు పెడుతారు.
బ్రాండ్ అంబాసిడర్ లు సౌందర్యంను చూసి రారు.పారిశ్రామిక అనుకూలతలతోనే పెట్టుబడులు వస్తుంది పెట్టుబడుల సంబంధించిన వివరాలు అంతా ప్రజల ముందు వైసీపి పెట్టాలి.
పెట్టుబడుల విషయంలో ఐటీ శాఖా మంత్రి వివరణ ఇవ్వాలి.ఆధానీ, అంబానీ గానీ పెట్టుబడులు పెట్టేందుకు జగన్ ని చూసి రాలేదు.
పవన్ కళ్యాణ్, బిజేపి రహస్యంగానే మాట్లాడుకుంటున్నాం.అవసరం అయ్యిన సమయంలో బిజేపి, జనసేన కలిసి పోటీ చేస్తుంది.
జనసేన, బిజేపి విడిపోవాలని కొన్ని పార్టిలు కోరుకుంటుంది.







