మహారాష్ట్ర మహా ఉత్కంఠకు తెర తొలగింది.ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన బీజేపీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పడ్నవీస్ వెంటనే తన బలాన్ని నిరూపించుకోవాలంటూ సుప్రీం ఆదేశించింది.అదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ రాజీనామా చేయడంతో పాటు తన వెనుక ఎమ్మెల్యేలు ఎవరు లేరనే విషయాన్ని గ్రహించాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బల పరీక్షను నెగ్గడం అసాధ్యం అని భావించిన బీజేపీ పడ్నవీస్‌తో రాజీనామా చేయించింది.
కర్ణాటక తరహా రాజకీయాన్ని చేయాలని చాలా ప్రయత్నించిన బీజేపీ అధినాయకత్వంకు ఎదురు దెబ్బ తలిగింది.
ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సమయం లేకపోవడంతో పాటు కొన్ని కారణాల వల్ల బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది.సుప్రీం కోర్టు దెబ్బతో మోడీ మరియు అమిత్ షాలకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది.
ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వచ్చింది.కాని మొదటి సారి మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం సాయంతో కూడా బీజేపీ అధికారం దక్కించుకోలేక పోయింది.







