600 సంవత్సరాల చరిత్ర గల తిరుమల పార్వేట మండపం జీర్ణోధరణ పురావస్తు శాఖ అనుమతితో జరిగిందా లేదా అనేదానిపై విచారణ జరగాలని తెలంగాణ బిజేపీ నేత కె.లక్ష్మణ్ కోరారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు… అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, భావితరాలకు మన పురాతన సంప్రదాయలను తెలియపరచాల్సిన అవసరం టీటీడీ పై ఉందన్నారు…
శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక కార్యక్రమాలకు, దేవాలయాలు నిర్మణాలకే ఖర్చు చేయాలని సూచించారు.ప్రభుత్వ నిర్వహించే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయరాదన్నారు… టీటీడీ బడ్జెట్ లో యేటా 1% నిధులు తిరుపతి నగరాభివృద్ధికి కేటాయించాలన్న నిర్ణయం వెనక్కు తీసుకోవడం సంతోషకరమని, భవిష్యత్తులో ఈ విధమైన ధార్మికేతర కార్యక్రమాలకు నిధులు కేటాయించే నిర్ణయాలను టీటీడీ బోర్డు తీసుకోకూడదని లక్ష్మణ్ కోరారు.