బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోంది...పల్లా రాజేశ్వర్ రెడ్డి

పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తెలంగాణ భవన్.బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోంది.

 Bjp Is Holding Dharnas Without A Minimum Understanding On The Issue Of Farmers .-TeluguStop.com

నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచాం.అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.

కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం.బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం దురదృష్టకరం.బీజేపీ నాయకులు కేంద్రప్రభుత్వం కార్యాలయాలు- ఢిల్లీలో ధర్నాలు చెయ్యాలి.ధర్నాలు చేసేది మారువేషంలో బీజేపీ నాయకులే.

2019- 20 లో 1కోటి 19లక్షల మెట్రిక్ టన్నులు– గత ఏడాది 1కోటి 40లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది.ఏ రాష్టంలోనైనా మార్కెట్ల దగ్గరకు రైతులు వెళ్తారు- కానీ తెలంగాణలో మాత్రం మార్కెట్ నే రైతుల దగ్గరకు తీసుకుపోయము.తెలంగాణ రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో పంట ఉందా లేదా అని కేంద్రాన్ని బండి సంజయ్ అడిగి తెలుసుకోవాలి.

గతంలో 60 లక్షల ఎకరాల్లో ధాన్యం వేశాము- ఇప్పుడు 60 నుంచి 80లక్షల ఎకరాల్లో ధాన్యం వేసేందుకు సిద్ధంగా ఉంచాం.వచ్చే యాసంగిలో పంటను కొంటామని కేంద్రం నుంచి లెటర్ బండి సంజయ్ ఇప్పించాలి.

ఇప్పటి వరకు వానాకాలం పంటను కొంటున్నాము- రైతులకు 1000 కోట్లు డబ్బులు ఖాతాల్లో వేశాము.

బీజేపీ రాజకీయ ప్రస్తానమే అబద్ధాలతో కూడుకున్నది.

ధర్నా చౌక్ మేము ఎత్తివేయ్యలేదు- అక్కడి ప్రజలు వద్దన్నారు.ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోర్టు ఆదేశాలతో మళ్ళీ ధర్నా చౌక్ ధర్నాలకు అవకాశం వచ్చింది.ప్రభుత్వానికి మిల్లర్లకు ఎలాంటి వ్యాపార ఒప్పందం లేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు.ముఖ్యమంత్రి ధర్నా చేయాల్సి వస్తే ఢిల్లీలో చేస్తారు రేపు హైదరాబాద్ లో జరిగే ధర్నాలో హైదరాబాద్ నాయకులు పాల్గొంటారు టీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube