తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.
తెలంగాణ యువత, రైతులు నిరాశలో ఉన్నారని అమిత్ షా తెలిపారు.ఇప్పుడు తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని తెలిపారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న అమిత్ షా రూ.లక్ష రుణమాఫీ చేయలేదని తెలిపారు.కేజీ టు పీజీ విద్యను గాలికి వదిలేశారని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.







