టీడీపీ జనసేన పొత్తుకు లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ ?

ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో,  అన్ని ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులపై పై పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) రాబోయే ఎన్నికల్లోను ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది .

ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) కూడా ఒంటరి పోరుకు సిద్ధమని,  దమ్ముంటే టిడిపి జనసేన ( TDP Janasena )లు కూడా ఒంటరిగానే పోటీ చేసి ఎన్నికల్లో గెలవాలంటూ సవాళ్లు చేశారు.అయితే వైసిపికి ఉన్న బలాన్ని లెక్కలు వేసుకుంటున్న టిడిపి , జనసేనలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉండదని,  మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని టిడిపి , జనసేన లు అభిప్రాయపడుతున్నాయి .అందుకే 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు ఈ రెండు పార్టీలు వచ్చాయి.

కానీ జనసేన బీజేపీతో పొత్తు కొనసాగిస్తుంది.కానీ ఈ రెండు పార్టీల మధ్య  పొత్తు ఉన్నా  లేనట్టుగానే పరిస్థితి ఉంది.ఏదో ఒక బలమైన కారణం చూపించి బిజెపి పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మేరకు జనసేన పదవ ఆవిర్భావ సభలోను బిజెపితో పొత్తు కారణంగా ముస్లింలు జనసేనకు దూరమయ్యారనే విషయాన్ని పవన్ చెప్పారు.దీనికి తగ్గట్లుగానే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు పోటీకి దిగినా,  జనసేన మద్దతు ఇవ్వలేదు .తాము కోరిన మద్దతుపై పవన్ స్పందించలేదని,  ఎటువంటి ప్రకటన చేయలేదని ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.  జనసేనకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చినా,  ఎంతగా ఒత్తిడి చేసినా,  రాబోయే ఎన్నికల నాటికి తమతో కలిసి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు జనసేన,  పవన్ టార్గెట్ గా విమర్శలు మొదలుపెట్టారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

బిజెపి జాతీయ నేతలు రాష్ట్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు.ఆ తర్వాత పవన్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ నేతలు ఈరకమైన కామెంట్లు చేస్తుండడం తో జనసేన తో కటీఫ్ చేసుకోబోతున్నారనే  విషయం అర్థమవుతోంది.పవన్ గురించి ఎక్కువగా ఆలోచించినా అనవసరమే అన్న అభిప్రాయం కి వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు జనసేన ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.

తాము ఎంతగా ప్రాధాన్యం జనసేనకు ఇచ్చినా పవన్ టిడిపి తో వెళ్లేందుకు సిద్ధమవడంతో బిజెపి నేతలు ఈ నిర్ణయానికి వచ్చారట.

Advertisement

తాజా వార్తలు