ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు, జగన్ బీజేపీకి బానిసలుగా మారారని ఆమె విమర్శించారు.
టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటు వేస్తే అది బీజేపీకి( BJP ) వేసినట్లేనని తెలిపారు.
ఏపీకి బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదా( AP Special Status ) ఊసే లేకుండా చేశారన్న షర్మిల కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.