తమకు బలం లేని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒకటి చేసి అధికారులకు రావడం భాజాపాకు అలవాటే.ఇంతకుముందు కర్ణాటకలోనూ మహారాష్ట్రలను ఆ పార్టీ వ్యూహాలను గమనించిన వారికి భాజపా తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా పడగొట్టగలదు లేదా నిలబట్టగలదు అని ఒక అభిప్రాయం అయితే వచ్చింది … ఇప్పుడు ఏపీలో కనీస ఓటు బ్యాంకు కూడా లేని బిజెపి( BjP ) అధికారాన్ని ఆశిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి( Vishnu Vardhan Reddy ) వ్యాఖ్యలు చూసినప్పుడు బిజెపిలో ఆపరేషన్ ఏపీ మొదలైందా ఆ దిశగా పావులు కదుపుతున్నారా అన్న అంచనాలు కలుగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే 2024 లో తమ తడాఖా చూపిస్తామని జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని అధికార వైసీపీని( YCP ) ఓడిస్తామని ఎన్నికల తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అంతర్దానమైపోతుందంటూ ఆయన జోష్యం చెప్పారు దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఏపీలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీతో పాటు మూడోపక్షంగా జనసేన కొనసాగుతుంది.జనసేన పక్షం కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు ఆ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ ని ఉద్దేశించి అన్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించి ఆ పార్టీని చీల్చి మహారాష్ట్రలో లాగా అధికారంలోకి రావడానికి భాజపా అధిష్టానం ప్లాన్ చేస్తుందా ? ? ఆంధ్రాలో కూడా ఎక్ నాధ్ షిండే లు ఉన్నారంటూ ఇంతకు ముందు ఇదే విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం చూస్తే బిజెపిలో ఆపరేషన్ ఏపీ మొదలైందని వార్తలు వస్తున్నాయి.

వాస్తవ పరిస్థితుల్లో చూస్తే నిజానికి కనీస ఓటు బ్యాంకు కూడా లేని బాజాపా అధికారం దిశగా వ్యాఖ్యలు చేస్తుందంటే ఏదో భారీ వ్యూహం ఉందంటూ వార్తలు వస్తున్నాయి .మరి పొలిటికల్ వేడిని పెంచడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారో లేకపోతే నిజంగానే వ్యూహాలతో ముందుకు ముందుకు వెళ్తున్నారో మరికొద్ది రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు ….







