బీజేపీ ఫైనల్ లిస్ట్ నేడు విడుదల ! జనసేన కు ఎన్ని సీట్లంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న బిజెపి దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది.ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

ఫైనల్ జాబితాను ఈరోజు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది.

ఈ పొత్తులో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం అంగీకారం తెలిపింది.అయితే జనసేన( Janasena ) మరో రెండు సీట్లు డిమాండ్ చేస్తూ ఉండడంతో,  మొత్తం 11 సీట్లు ఇచ్చేందుకు  అంగీకారం తెలిపిందట.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు పంచుకున్న ఖమ్మం,  నల్గొండ జిల్లాలో మిగతా స్థానాలను జనసేన కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఈరోజు రాత్రికి తుది జాబితా విడుదల చేసేందుకు బిజెపి ( BJP )అధిష్టానం కసరత్తు చేస్తోందట.ఈ సాయంత్రం ఢిల్లీలో బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది.ఈ సందర్భంగా ఫైనల్ లిస్ట్ ను ఖరారు చేయబోతున్నారు.

అలాగే జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం తీసుకోనున్నారు.జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం అంగీకారం తెలిపింది.

ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి,  శేరిలింగంపల్లి,  ఎల్బీనగర్ వంటి స్థానాలను ప్రధానంగా జనసేన

 ఈ నేపథ్యంలో బిజెపి ఆయా నియోజకవర్గాలను జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తుండడం ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 29 రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాని పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి.ప్రజా ఆశీర్వాద సభలతో కేసీఆర్ దూకుడు పెంచడం,  మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )తెలంగాణ పై ప్రత్యేక హోదా పెట్టడంతో బిజెపి కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించి, జనసేనతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు