ఆ వర్గం ఓట్లపై కన్నేసిన బీజేపీ.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

జాతీయ పార్టీ అయిన బీజేపీ ( BJP ) దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడం లేదు.ఇక ఆ మధ్యకాలంలో పార్టీ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే పార్టీ అధ్యక్షుడిని తొలగించి బిజెపి అధి నాయకత్వం పెద్ద పొరపాటు చేసింది.

 Bjp Eyeing On The Votes Of That Group.. Will The Plan Work Out , Bjp , Amit Sh-TeluguStop.com

ఆ పొరపాటు వల్ల ప్రస్తుతం పార్టీలో ఉన్న చాలా మంది కీలక నేతలు పార్టీని వీడి వెళ్లారు.అయితే మరో వారం రోజులు కూడా ఎన్నికల ప్రచారానికి సమయం లేదు.

తెలంగాణలో అమిత్ షా ( Amit shah ) , మోడీలు మరోసారి పర్యటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చాలామంది నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం వేగవంతం చేశారు.

అయితే బిజెపి ప్రస్తుతం ఆ వర్గం ఓట్లపై కన్నేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఆ వర్గం ఏదో కాదు దళిత వర్గం ఓటు బ్యాంక్.

ఎమ్ఆర్పిఎఫ్ నాయకుడు మందకృష్ణ మాదిగ తో కలసి మోడీ ( Narendra Modi ) కులగణన చేస్తామని చెప్పుకొచ్చారు.అలాగే ప్రస్తుతం మందకృష్ణ మాదిగని బిజెపి ప్రచారం కోసం వాడుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఆయనకు ఒక సపరేటు హెలికాఫ్టర్ ని కూడా సిద్ధం చేశారు.ఇక ఈ నెల 24 నుండి వరుసగా మూడు రోజులు ఆయన బిజెపి తరఫున ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం.

Telugu Amit Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Kishan Reddy, Mandakri

ఈ నేపథ్యంలోనే మాదిగలు,ఉప కులాలు వంటి వర్గం ఓట్లపై బిజెపి కన్నేసిందట.దళిత వర్గం పైనే బిజెపి ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఇక మందకృష్ణ మాదిగ అలాగే ఇంకొంతమంది దళిత నాయకులు తమ పార్టీకి ప్రచారం చేస్తే ఖచ్చితంగా తమకి మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు.మందకృష్ణ మాదిగ ( Manda Krishna Madiga )వంటి వాళ్ళు తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే చాలా మంది దళిత ఓట్లు గంప గుత్తగా వచ్చి బిజెపికి పడతాయని వారి నమ్మకం.

Telugu Amit Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Kishan Reddy, Mandakri

ఈ నమ్మకంతోనే ఎమ్మార్పీఎఫ్ నాయకుడు మందకృష్ణ మాదిగతో తరచూ బిజెపికి సంబంధించిన సీనియర్ నాయకులు, కీలక నేతలు చర్చలు చేస్తున్నారట.అలాగే మోడీ కూడా అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని మాట ఇవ్వడం వీరికి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు.ఇక ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ దళిత బంధు పేరుతో కొంతమంది దళితులకు మాత్రమే డబ్బులు ఇచ్చారు.ఇక ఒక ఊరిలో పది మందికి వస్తే మిగిలిన వారందరూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు.

ఇక అలాంటి వారి ఓట్లను తమ వైపుకు తిప్పుకునేలా బిజెపి పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇది గనుక సక్సెస్ అయితే దళిత ఓట్లన్ని బిజెపికి పడడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube