తెలంగాణలో లోక్ సభ( Lok Sabha ) అభ్యర్థుల ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.
అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆశావహుల జాబితాను తీసుకెళ్లినట్లు సమాచారం.కాగా మొత్తం 17 నియోజకవర్గాల్లో సుమారు 70 మందికి పైగా ఆశావహులు టికెట్లను ఆశిస్తున్నారు.ఈ నేపథ్యంలో జాబితాపై పార్టీ అధినాయకత్వంతో చర్చిస్తారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వచ్చే నెల మొదటి వారంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఫస్ట్ లిస్టులో కనీసం ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.అయితే లోక్ సభ ఎన్నికల్లో ఆరు నుంచి ఎనిమిది స్థానాలు కచ్చితంగా గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.