తెలంగాణలో పార్టీ పటిష్టతపై కమలదళం కసరత్తు మొదలుపెట్టింది.ఈ క్రమంలో బూత్ కమిటీల బలోపేతంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే రేపు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లు హైదరాబాద్ కు రానున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ పటిష్టతపై ఇంఛార్జ్ లు స్వయంగా సమీక్షించనున్నారు.
అదేవిధంగా కమిటీల పనితీరుతో పాటు పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.కాగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 34 వేల బూత్ కమిటీలు ఏర్పాటు కాగా… ఒక్కో కమిటీలో 21 మంది సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.







