టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేయాలని బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది.ఇందులో భాగంగా కమలనాథులు నిరుద్యోగ మార్చ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి 6 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.అనంతరం హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ ను బీజేపీ చేపట్టనుంది.
అదేవిధంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే విషయంలో కూడా ఉన్నట్లు సమాచారం.







