బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా - డికె అరుణ

శ్రీమతి డికె అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన.దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్ సవాల్.

 Bjp Dk Aruna Condemns Ktr Comments On Bandi Sanjay Details, Bjp, Dk Aruna ,ktr C-TeluguStop.com

బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసినప్పుడు.

నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్? అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా…? ఏ డ్రగ్ తీసుకున్నా.ఆ (ఉత్ప్రేరకం) డ్రగ్ ఆనవాళ్లు, మనిషి శరీరంలో డ్రగ్ ని బట్టి, 24 గంటలు, కొన్ని డ్రగ్స్ లో ఆరు నెలల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయి.

దున్నపోతు మీద వర్షం పడ్డట్టు.రెండేళ్ల క్రితం బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా.ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్ విసిరితే ఏం లాభం కేటీఆర్?

నువ్వు డ్రగ్స్ తీసుకున్న తర్వాత… మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి, డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాక… నీ బాడీలో డ్రగ్ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే… దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్? నీకు దమ్ము, ధైర్యం ఉంటే.నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే….మా బండి సంజయ్ చేసిన సవాల్ కు, అప్పుడే ఎందుకు స్పందించలేదు?

Telugu Bandi Sanjay, Dk Aruna, Ktr, Ktr Drugs, Telangana-Political

అప్పుడే నువ్వు నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా నీ బాడీలో ఇంకా ఏమైనా పార్ట్స్ ఉంటే… అవి ఇవ్వకుండా… ఇన్ని రోజులు ఎందుకు ఆగావు కేటీఆర్? ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? సీఎం కొడుకై ఉండి, భవిష్యత్ సీఎం నువ్వే అని ప్రచారం చేయించుకుంటున్న నువ్వే… ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేస్తే… ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి.నీ ఉడత ఊపులకు… పిట్ట బెదిరింపులకు, పిల్ల చేష్టలకు ఇక్కడ ఎవరూ భయపడరు.ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో.ప్రజలే నిర్ణయిస్తారు.మీ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube