సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17పై తన వైఖరీ చెప్పాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గుర్తు చేశారు.తెలంగాణలో ఎందరో వీరులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విమోచనాన్ని సాధించుకున్నారని.
సీఎం కేసీఆర్ ఎందుకు విమోచనాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు.బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ లో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై అధికార టీఆర్ ఎస్, ఎంఐఎంపై ధ్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదన్నారు.
విమోచనాన్ని పక్కన ఉన్న కర్ణటక, మహారాష్ట్ర అధికారికకంగా నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు.తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నాడు నిజాం పాలన నుంచి నాటి ఉప ప్రధాని సర్ధార్ పటేల్ సైనిక చర్య వలన తెలంగాణ ప్రజలకు స్వేచ్చ వచ్చిందన్నారు.
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్‌కు పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్ దేశ ప్రజలు మర్చిపోయ్యారని ఎదేవా చేశారు.
ఎంఐఎం జోక్యం లేని ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణలో నిజమైన స్వాతంత్రం వస్తుందన్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

తెలంగాణంలో ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు.తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపడుతామని దీమా వ్యక్తం చేశారు.బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ అనుసారిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు.దేశంలో రక్షణ, రాష్ట్ర సంక్షేమం ఒక్క బీజేపీతో సాధ్యమౌతుందని స్పష్టం చేశారు.