లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో గెలుపు కోసం బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది.ఇందులో భాగంగా 38 ప్రత్యేక కమిటీలను నియమించింది.
ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా కిషన్ రెడ్డి( Kishan Reddy ) నియామకం అయ్యారు.ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్లుగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కో కన్వీనర్లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి మోహనరావు, రామచంద్రరావు నియమితులు అయ్యారు.
అలాగే మ్యానిఫెస్టో కమిటీ ప్రముఖ్( Manifesto Committee ) గా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఉండగా.మీడియా బీజేపీ ఇంఛార్జ్ గా కృష్ణసాగరరావు ఉన్నారు.
బీజేపీ ఛార్జిషీట్ కమిటీ ప్రముఖ్ గా మురళీధర్ రావు, సోషల్ మీడియా బీజేపీ ఇంఛార్జ్ గా పోరెడ్డి కిషోర్ రెడ్డిని బీజేపీ( BJP ) నియమించింది.