బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ! ఆశావాహుల్లో టెన్షన్

ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )అభ్యర్థులను ప్రకటించడంతో పాటు,  మ్యానిఫెస్టోను ప్రకటించగా,  కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితాను నిన్ననే విడుదల చేసింది.

  దీనితో బిజెపి కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు మరింత ముమ్మరం చేసింది.

ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.ఈ సందర్భంగా తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక అంశంపై కీలకంగా చర్చించనున్నారు.

దీంతో బిజెపి టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారంతా ఈ భేటీ పై ఉత్కంఠ గా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన మరికొద్ది రోజులు ఆలస్యం అయ్యేటట్టుగానే కనిపిస్తుంది.

బీఆర్ఎస్ , కాంగ్రెస్( BRS Congress ) అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి , వారికి ధీటుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు బిజెపి కసరత్తు చేస్తోంది .

Advertisement

ఇప్పటికే ఆశావాహులా నుంచి దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో,  ఆ దరఖాస్తులను ఫైనల్ చేసే పనిలో బిజెపికి నేతలు నిమగ్నం అయ్యారు.ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో క్లారిటీ వచ్చింది.  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి పోటీకి దిగనున్నారు .ఈ మేరకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు ఆయన క్లారిటీ ఇచ్చారు.అలాగే ఎంపీ లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండనున్నారు.

దీంతో ముషీరాబాద్ నుంచి కొత్తవారికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  అలాగే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలపై బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

బిజెపి నేత రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు.

 అలాగే ఇబ్రహీంపట్నం నుంచి బూర నరసయ్య గౌడ్( Boora Narsaiah Goud )పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఈటెల రాజేందర్ ( Etela Rajender )గజ్వేల్,  హుజూరాబాద్ ల నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు.మిగతా నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో హై కమాండ్ కి సమాచారం ఇచ్చారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇది ఇలా ఉంటే ఈరోజు కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్( Rajnath Singh ) పర్యటించరున్నారు .ఈ సందర్భంగా హుజూరాబాద్ నుంచి ఎన్నికల సమర శంఖారావాన్ని బిజెపి పూరించింది.  జమ్మికుంట డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ సభలో రాజనాధ్ సింగ్ ప్రసంగించనున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ పై బిజెపి నేతలు దృష్టి సారించారు.

Advertisement

తాజా వార్తలు