హైదరాబాద్ లో రేపు బీజేఎల్పీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనుంది.ఈ మేరకు రేపు ఉదయం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది.ఇందులో ప్రధానంగా రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ఎమ్మెల్యేగా తాను ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ చెబుతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకొనున్న కిషన్ రెడ్డి విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు.
రేపు బీజేఎల్పీ సమావేశం అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది.







