తెలంగాణా ప్రజల్లో టీయార్ఎస్ పార్టీ పై వ్యతిరేకత ఉన్నా బయటకు రావడం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.గులాభి నేతలు ప్రజల్లోకి వెళ్లినప్పుడు నిరసనలు ఎదుర్కోవడం అందరికి తెలిసిందే.
ఎన్నికల సమయాల్లో కూడా చేదు అనుభవాలను మూటగట్టుకున్న గానీ, కొంత అయిన ఆలోచన లేకుండా తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చామని ప్రజలను మభ్యపెడుతు ఓట్లను సాధించుకుంటున్నారు.ఒకరకంగా తెలంగాణలో ప్రభుత్వ పాలన కుంటుపడిందని ప్రజల మనోగతం అంట.
ఇక తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో చేదు అనుభవం ఎదురైంది.జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ, ఐకేపీ సెంటర్ ఉన్న స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పడంతో సత్తవ్వ అనే మహిళ ఆ స్థలంలో ఇళ్లు కట్టవద్దని కన్నీరు పెట్టుకుందట.
ఆమెకు మద్దతుగా మిగతా మహిళలు కూడా చేరి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే ఆ స్థలంలో ఇళ్ల కట్టడాలు చేపట్టబోమని హామీ ఇచ్చారని సమాచారం.