వేణుస్వామి పరువు తీసిన బిత్తిరి సత్తి.. వేలుస్వామి అంటూ మామూలుగా టార్గెట్ చేయలేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిత్తిరిసత్తికి( Bithiri Sathi ) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బిత్తిరి సత్తి కామెడీ టైమింగ్ స్పెషల్ గా ఉంటుంది.

 Bithiri Sathi As Velu Swamy Family Star Tho Ugadi Ummadi Kutumbam,bithiri Sathi,-TeluguStop.com

బిత్తిరి సత్తిని ఎవరూ ఇమిటేట్ చేయలేరనే సంగతి తెలిసిందే.జీ తెలుగు ఛానల్ లో ఉగాది పండుగ కానుకగా ఉగాది ఉమ్మడి కుటుంబం( Ugadi Ummadi Kutumbam ) పేరుతో ఒక షో ప్రసారమవుతోంది.

బిత్తిరి సత్తి మాట్లాడుతూ నా పేరు వేలుస్వామి అని చెప్పుకొచ్చారు.అలీ గారికి ఏపీలో ఏం జరగబోతుందో చెబుతానని మేలో ఎండలు ఇంకా పెరుగుతాయని బిత్తిరి సత్తి అన్నారు.

రాశి గారికి రాశిఫలాలు( Rashiphalalu ) చెబుతానని 2020లోనే మీరు ఒక ప్రముఖ హీరోపై చెయ్యి వేసుకుంటారని చెప్పానని బిత్తిరిసత్తి కామెంట్ చేశారు.నిజంగా వేసుకున్నారు చూడండి అంటూ మూవీ ఈవెంట్ వీడియోను బిత్తిరి సత్తి చూపించారు.

ఒక ఈవెంట్ లో శ్రీకాంత్( Srikanth ) చేతిని రాశి పట్టుకోగా ఆ ఫోటోను బిత్తిరి సత్తి చూపించారని తెలుస్తోంది.మీరు హీరోయిన్ గా ఒక సినిమా రిలీజ్ అవుతుందని కస్తూరితో బిత్తిరి సత్తి పేర్కొన్నారు.ఇన్ని సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయని మీ అన్నమయ్య రీరిలీజ్ కాగా అంటూ బిత్తిరి సత్తి కామెంట్లు చేశారు.ఇషాచావ్లా( Isha Chawla )తో శుక్ర ఉంది బుధ ఉంది అని చెప్పగా మీకు కరువు ఎక్కువ ఉంది అంటూ ఆమె రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు.

వేణుస్వామిని వేలుస్వామి( Velu Swamy ) అంటూ బిత్తిరి సత్తి ఇమిటేట్ చేసిన కామెడీ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ ప్రోమోకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఉగాది పండుగ రోజున సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.వేణుస్వామి తనను ఇమిటేట్ చేయడం గురించి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.

వేణుస్వామి( Venu Swamy ) తరచూ వివాదాస్పద కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube