సముద్రం అడుగున దూసుకుపోతున్న వింత జీవి.. ఇది ఏమై ఉంటుందో!

భూమిపై ఉండే జీవ రాశుల గురించి మనకు పూర్తిగా తెలియదు.నిత్యం ఎన్నో రకాల జీవుల గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి వెలుగులోకి తీసుకొస్తారు.

 Bird Like Creature Flying At The Bottom Of The Sea Video Viral Details, Bird Lik-TeluguStop.com

అంతరించిపోయిన జీవులతో పాటు ప్రజలకు తెలియని జీవుల గురించి వారు పరిశోధనలు చేస్తుంటారు.ముఖ్యంగా సముద్రం అడుగున( Bottom Of Sea ) మనకు తెలియని జీవులు అసంఖ్యాకంగా ఉంటాయి.

అప్పుడప్పుడు డైవర్లు సముద్రం అడుగు భాగంలో ఈతకొడుతూ అక్కడ కనిపించిన దృశ్యాలను రికార్డ్ చేస్తుంటారు.ఇలాంటి సందర్భాల్లో అప్పటి వరకు సామాన్య ప్రజలు చూడని జీవులు అందులో కనిపిస్తాయి.

తాజాగా అలాంటి ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నీటి అడుగున చేప కంటే వేగంగా ఓ జీవి( Strange Creature ) ఈదుతోంది.అది ఈత కొడుతున్న స్టైల్ చూస్తే గాల్లో పక్షి ఎగురుతున్నట్లు కనిపిస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

అంతరించి పోయిన లేదా జన బాహుళ్యానికి తెలియని జీవుల గురించి శాస్త్రవేత్తలు( Scientists ) నిత్యం పరిశోధనలు సాగిస్తుంటారు.వాటి వల్ల ప్రయోజనాలు తెలుసుకుని ప్రపంచానికి తమ పరిశోధనల ఫలితాన్ని సంతోషంగా వివరిస్తారు.

ఇదే కోవలో ఇటీవల కొందరు శాస్త్రవేత్తల బృందం సముద్రం అడుగు భాగంలో డైవింగ్ కోసం వెళ్లింది.ఆ సమయంలో వారు కనిపించిన దృశ్యాలను వీడియో తీశారు.

అందులో ఒక జీవి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.దానిని చూడగానే అంతా అది పక్షి( Bird ) అని భావిస్తారు.అంతలా దాని రూపం ఉంది.ఇక అది పక్షినా? లేక చేప( Fish ) అయి ఉంటుందా అని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు.అయితే పరిశోధనల తర్వాత అది ఒక చేపగా తేలింది.దీనికి సంబంధించిన వీడియోను వారు ది బెస్ట్ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.

నెటిజన్ల నుంచి దీనికి ఊహించని స్పందన వస్తోంది.ఇప్పటి వరకు అలాంటి జీవిని తాము చూడలేదని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube