Canada : దౌత్య ఉద్రిక్తతల ఎఫెక్ట్ : కెనడా పీఆర్‌పై తగ్గుతోన్న భారతీయుల ఇంట్రెస్ట్ .. దరఖాస్తుల్లో ఇంత తేడానా..?

డిసెంబర్ 2023లో కెనడాలో ( Canada )శాశ్వత నివాసం కోసం భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 62 శాతం మేర పడిపోయింది.న్యూఢిల్లీ , ఒట్టావా మధ్య ద్వైపాక్షిక ఉద్రిక్తతల ప్రభావం ఇమ్మిగ్రేషన్ నమూనాలలో కనిపిస్తుంది.ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ కెనడా (ఐఆర్‌సీసీ) నుంచి వచ్చిన డేటా ప్రకారం.2022 డిసెంబర్‌లో 16,796 మంది దరఖాస్తులు చేసుకోగా.2023లో అదే సమయం నాటికి ఇవి 6,329కి పడిపోయాయి.2023 చివరి త్రైమాసికంలో భారతీయుల దరఖాస్తులు 35,735 నుంచి 19,579కి పడిపోయాయి.

 Bilateral Tensions Result In Fewer Indians Immigrating To Canada-TeluguStop.com

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) గతేడాది జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.దీని వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం వుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దీనికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టిగా బదులిచ్చింది.ఈ ఆరోపణలు అసంబద్ధం, రాజకీయ ప్రేరేపితమని కౌంటరిచ్చింది.ఈ వ్యవహారం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.భారతీయుల సంఖ్య తగ్గడానికి దోహదపడే మరో అంశం.

కెనడా దౌత్యపరమైన ఉనికి.ట్రూడో వ్యాఖ్యల తర్వాత భారత్‌లో అధికంగా వున్న కెనడియన్ దౌత్యవేత్తలను వెనక్కి పిలవాల్సిందిగా మోడీ ప్రభుత్వం సూచించింది.

Telugu Canada, Hardeepsingh, International, Khalistantiger, Miller, Delhi, Ottaw

మరోవైపు.కెనడాలో గృహ సంక్షోభం నానాటికీ తీవ్రరూపు దాల్చుతోంది.ఈ క్రమంలో అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించాలని యోచిస్తోంది.దేశంలోని ప్రావిన్సుల్లో వ్యక్తిగత విద్యాసంస్ధలు ఏం చేస్తున్నాయో ఫెడరల్ స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం వుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మిల్లర్ ( Minister Miller )అభిప్రాయపడ్డారు.

ఇమ్మిగ్రేషన్ లక్ష్యాల విషయానికి వస్తే గృహ నిర్మాణం గణనలో ఒక భాగం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

Telugu Canada, Hardeepsingh, International, Khalistantiger, Miller, Delhi, Ottaw

శ్రామిక శక్తి సగటు వయసును తగ్గించాల్సిన అవసరాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు.విద్యాసంస్ధల అవసరాలు కూడా ఇందుకు ఒక కారణమని మార్క్ మిల్లర్ అభిప్రాయపడ్డారు.వాస్తవానికి లిబరల్ ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం 4,85,000 మందిని .2025, 26లలో 5 లక్షల మంది వలసదారులను కెనడాకు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.తాత్కాలిక నివాసితులు ప్రధానంగా అంతర్జాతీయ విద్యార్ధులు గతేడాది మూడో త్రైమాసికం నాటికి 3 లక్షల మందికి పైగా కెనడాకు చేరుకున్నారని గణాంకాలు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube