ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు వ్యతిరేకంగా జగ్గయ్యపేట పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు దుర్మార్గపు ఆలోచన.NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.
జగన్ రెడ్డి తీరు సొమ్ముఒకరిది సోకు మరొకరిది అన్నట్టుగా ఉంది.తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమే.జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు.
36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం.మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.
కూల్చడం, రంగులను వేయడం, పేర్లను మార్చడం తప్ప మూడున్నర ఏళ్లలో ఏమైనా చేశారా.నీకు చేతనైతే కొత్తవి కట్టించి వాటికి మీ నాన్న వైస్సార్ పేరు పెట్టుకో.
ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతున్నారు.? ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.