వైరల్: ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం..!

రాములవారి కళ్యాణానికి అంగరంగ వైభవంగా పలు ఆలయాల్లో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఆలయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించలేదు.కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కల్యాణ వేడుకలను భక్తులు కనులారా తిలకించే అవకాశం కలిగింది.

దీంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.అయితే.

బీహార్ లో జరిగే శ్రీరామ నవమి ఈ సారి చరిత్ర సృష్టించబోతోంది.బీహార్ లోని భగల్​పుర్ లో భక్తులు ఓ అరుదైన దృశ్యాన్ని చూడనున్నారు.

Advertisement

శ్రీరామనవమి సందర్భంగా 150 అడుగులు రాముల వారి చిత్రాన్ని అక్కడ తయారుచేశారు.భాగల్‌పూర్‌లోని లజ్‌పత్ పార్క్ మైదానంలో దాదాపు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటాన్ని వారు రూపొందించారు.

ఈ చిత్రాన్ని తయారుచేయడానికి ఎందరో గత ఐదు రోజులుగా కష్టపడుతున్నారు.ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అర్జిత్​ చౌబే మాట్లాడుతూ.

గత రెండు సంవత్సరాలుగా శ్రీరామనవమిని జరుపుకోలేకపోయామని, అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దాదాపు వివిధ రంగులతో 150 అడుగుల రాముల వారి విగ్రహాన్ని చిత్రీకరించామని చెప్పారు.

ఇలాంటిది మునుపెన్నడూ ఎవరూ తయారుచేయలేదని.ఇది వరల్డ్ రికార్డ్ గా నిలవడం ఖాయమని ఆయన తెలిపారు.దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించే సభ్యులు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారని తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!

ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఈ సారి బిహార్​ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్​, కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే సహా పలువురు కేంద్ర మంత్రులు , ఎంపీలు హాజరుకానున్నారు.అంతేకాక భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలి రానున్నారు.

Advertisement

‌.

తాజా వార్తలు