బిగ్ బాస్ ఓటిటి అటకెక్కినట్టే..!

BiggBoss Telugu OTT Shelved , BiggBoss Telugu , BiggBoss Telugu OTT , Star Maa , Nagarjuna

బిగ్ బాస్ సీజన్ 6 పూర్తి కాగా సీజన్ 7 కి సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.ఇదిలాఉంటే సీజన్ 5 పూర్తి కాగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు.

 Biggboss Telugu Ott Shelved , Biggboss Telugu , Biggboss Telugu Ott , Star Maa-TeluguStop.com

దానికి చాలా పేలవమైన రెస్పాన్స్ రాగా అయినా సరే మొదలు పెట్టింది పూర్తి చేయక తప్పదు కాబట్టి బిగ్ బాస్ నాన్ స్టాప్ 70 రోజులు నడిపించారు.ఇక బిగ్ బాస్ సీజన్ 6 టీవీల్లో కాబట్టి పర్లేదు అనిపించింది.

అయితే సీజన్ 6 అనుకునంత రేంజ్ లో సక్సెస్ అవలేదు అన్నది మాత్రం వాస్తవం.సీజన్ 1 నుంచి 5 వరకు జరిగిన ఎపిసోడ్స్ చూస్తే సీజన్ 6 చాలా తక్కువ రేటింగ్ తెచ్చుకుంది.

ఇక సీజన్ 7కి ముందు కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 ఉంటుందని అనుకున్నారు.కానీ బిగ్ బాస్ ఓటీటీ దాదాపు అటకెక్కినట్టే అని తెలుస్తుంది.

బిగ్ బాస్ ని ఆడియన్స్ కేవలం టీవీలో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు తప్ప ఓటీటీలో అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.అందుకే బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఆడిషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube