బిగ్ బాస్ సీజన్ 6 లో ఆసలు ఆట మొదలైంది.సోమవారం నాడు క్లాస్, ట్రాస్, మాస్ అంటూ ఓ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ టాస్క్ ద్వారా ఓ ముగ్గురిని నామినేషన్స్ లో లేకుండా చేశాడు.
మంగళవారం ఎపిసోడ్ లో కూడా అదే టాస్క్ కొనసాగించారు.అయితే టాస్క్ ముగిసే సమయానికి శ్రీహాన్, అభినయ శ్రీ, ఇనయా సుల్తాన్ ట్రాష్ లో ఉన్నారు.
అందుకే వారు డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్లారు.ఇక క్లాస్ లో ఉన్న కారణంగా ఆది రెడ్డి, గీతు, నేహాలకు నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.
ఇక టాస్క్ ముగిసిన తర్వాత మళ్లీ హౌజ్ మెట్స్ లో మిగిలిన వారి మధ్య నామినేషన్ ప్రాసెస్ పెట్టాడు బిగ్ బాస్.ఈ నామినేషన్స్ లో అందరు రేవంత్ ని టార్గెట్ చేశారు.
అతను హౌజ్ లో అన్ని పనులు చేస్తున్నా కొన్ని విషయాల్లో నచ్చట్లేదని కొందరు హౌజ్ మెట్స్ చెప్పారు.బిగ్ బాస్ 6 మొదటి నామినేషన్స్ లోనే గొడవలు మొదలయ్యాయి.
ఫైమాని కూడా రేవంత్ నామినేట్ చేయగా.అర్జున్ కళ్యాణ్ కూడా ఫైమా ని నామినేట్ చేశాడు.