బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా వారం రోజులు పూర్తి చేసుకుంది.ఈ వారం రోజుల్లో హౌజ్ మెట్స్ కొందరు ఆడియన్స్ కి ఇప్పటికే బాగా నచ్చేశారు.
ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున అదరగొడుతున్నారు.ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి రీసెంట్ గా జరిగిన శని, ఆదివారాల్లో కూడా నాగ్ ఎనర్జీ హౌజ్ మెట్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ కి కూడా ఎక్సయిటింగ్ అనిపించింది.
హోస్ట్ గా నాగార్జున ఈసారి కేవలం స్క్రిప్ట్ మాత్రమే చదవకుండా ఎపిసోడ్ కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఈ సీజన్ 6 లో మరింత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.
ఓ పక్క సినిమాలతో పాటుగా బిగ్ బాస్ కోసం నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.సీజన్ 6 లో నాగ్ హోస్టింగ్ కి అందరు ఫిదా అవుతున్నారు.
నాగార్జున టైమింగ్ కి.హోస్టింగ్ టాలెంట్ కి బిగ్ బాస్ ఆడియన్స్ అంతా నాగార్జునని తెగ పొగిడేస్తున్నారు.ఇదివరకు సీజన్ల కన్నా నాగ్ ఈసారి దుమ్ముదులిపేస్తున్నాడని అంటున్నారు. 106 రోజులు జరగనున్న బిగ్ బాస్ సీజన్ 6 రానున్న వీకెండ్ ఎపిసోడ్స్ తో నాగ్ మరింత సర్ ప్రైజ్ చేస్తాడని చెప్పొచ్చు.







