బిగ్ బాస్ సీజన్ 6 లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో రేవంత్ తర్వాత ఫైమాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.అయితే బుధవారం ఇలా నామినేషన్స్ అయ్యాయో లేదో అలా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
అయితే అనూహ్యంగా నామినేట్ అయిన ఏడుగురు సభ్యులలో ఫైమాకే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉందని తెలుస్తుంది.జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఫైమా బిగ్ బాస్ ఆఫర్ రాగానే వచ్చిన అవకాశాన్ని అందుకుంది.
హౌజ్ లో ఆమె కామెడీ పంచాలని చూస్తుంది.అయితే ఆ కామెడీ వల్ల కొందరు హర్ట్ అవుతున్నారు.
అయినా కూడా నామినేషన్స్ లో ఉన్న ఫైమా ఓటింగ్ పర్సెంటేజ్ లో టాప్ 1, 2 పొజిషన్స్ లో ఉంటూ వస్తుంది.హౌజ్ లో ఫైమా అంత పర్ఫార్మెన్స్ కూడా చేసింది లేదు అయినా సరే ఆమెకి ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది అంటే హౌజ్ లో ఆమెకి కరెక్ట్ టాస్క్ ఒకటి పడి అది గెలిస్తే మాత్రం ఫైమాకి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.
జబర్దస్త్ తో వచ్చిన ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ని ఫైమా కి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు.అయితే అదే జబర్దస్త్ నుంచి వచ్చిన చంటి కూడా ఈ నామినేషన్స్ లో ఉండగా అతను కూడా ఓటింగ్స్ లో ఫైమా కన్నా వెనకబడి ఉన్నాడు.