లోన్ యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం మండిపడింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల ఏపీలో ఆన్లైన్ లోన్ యాప్‌ల నిర్వహకుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా యాప్ నిర్వహకుల వేధింపులు తాళలేక రాజమండ్రిలో దంపతులు బలవన్మరణం చెందారు.







