బిగ్ బాస్ 5 : సుదర్శన్ చేత సారీ చెప్పించిన సన్నీ ఫ్యాన్స్..!

బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఫైనల్ పోరులో సన్నీ కన్ఫర్మ్ కాగా షణ్ముఖ్, శ్రీరాం వీరితో టైటిల్ ఫైట్ ఉంటుందని అర్ధమవుతుంది.ఇదిలాఉంటే షోలో బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్ టాస్క్ ప్లేయర్ గా సన్నీ అదరగొడుతున్నాడు.అయినా సరే బిగ్ బాస్ టీం, హోస్ట్ తో సహా సన్నీని డిస్ కరేజ్ చేస్తున్నారన్న టాక్ ఉంది.

ఈ క్రమంలో సండే ఎపిసోడ్ లో అనుభవించు రాజా టీం తో పాటు వచ్చిన కమెడియన్ సుదర్శన్ సన్నీ మీద కొన్ని కామెంట్స్ చేశాడు.సన్నీ కోప్పడితే మేము నవ్వుకుంటామని అన్నాడు.

అంతేకాదు సన్నీ, కాజల్ ల రిలేషన్ గురించి బ్యాడ్ గా చెప్పాడు.ఇద్దరి రొమాన్స్ ఓ రేంజ్ లో ఉందని అన్నాడు.

ఈ కామెంట్స్ పై బిగ్ బాస్ ఆడియెన్స్ ముఖ్యంగా సన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.ప్రోమో రాగానే సుదర్శన్ మీద ఎటాక్ మొదలు పెట్టగా షో చూశాక మరింత ఎటాక్ చేశారు.

ఏదో సినిమా ప్రమోషన్ కి వచ్చాక వెళ్లామా అన్నట్టు కాకుండా షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టంట్ గురించి అలా మాట్లాడేసరికి సన్నీ ఫ్యాన్స్ సుదర్శన్ మీద విమర్శలు చేశారు.వీరి కామెంట్స్ దాటికి సుదర్శన్ మళ్లీ తిరిగి ఓ స్పెషల్ వీడియో మెసేజ్ పెట్టాడు.

నేను చాలా మాట్లాడితే బిగ్ బాస్ టీం కట్ చేసి తాను అన్న ఆ ఒక్క పదాన్నే ఉంచారని సన్నీ ఫ్యాన్స్ కి, కాజల్ ఫ్యామిలీకి సారీ అనేశాడు సుదర్శన్.దానితో సుందర్శన్ మీద శాంతించారు సన్నీ ఫ్యాన్స్.

తాజా వార్తలు