తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్న బిగ్ బాస్ కౌశల్.. వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కడ లేదు.బిగ్బాస్ హౌస్కి ఎంట్రీ ఇవ్వకముందు వరకు కౌశల్ ఎన్నో సీరియల్స్ లో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Bigg Boss Winner Kaushal Gave An Unexpected Gift To His Father , Bigg Boss Kaush-TeluguStop.com

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి తన సత్తాను చాటుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సీరియల్స్ లో నటించడంతో పాటు ఎక్కువగా టీవీ షోలో పాల్గొంటున్నాడు.

తన భార్యతో కలిసి కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టాడు.

Telugu Biggboss, Kaushal-Movie

ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూనే ఉన్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా కౌశల్ తన యూట్యూబ్ కథలో ఒక వీడియోని విడుదల చేశాడు.ఆ వీడియోలు తన తండ్రికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

కౌశల్ తండ్రి కూడా మనందరికీ సుపరిచితమే.కౌశల్ తండ్రి కూడా పలు సీరియల్స్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

కాగా ఆ వీడియోలో కౌశల్ తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఒక అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడు.ఎప్పటినుంచో కౌశల్ నెరవేర్చాలి అనుకుంటున్నా తండ్రి కోరికను తాజాగా కోసం నెరవేర్చాడు.

Telugu Biggboss, Kaushal-Movie

2021లో ఫాదర్స్ డే సందర్భంగా కౌశల్ తండ్రి తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని అడిగాడట.ఆ ఇల్లు కూడా వైజాగ్లో కావాలని కోరగా అప్పటినుంచి కౌశల్ ఎలా అయినా తన తండ్రికి ఇల్లు కొనివ్వాలని తన తండ్రి కోరికను నెరవేర్చాలని అనుకున్నారట.తాజాగా కౌశల్ తన తండ్రికి హైదరాబాదులోని ఒక చిన్న ఇల్లు కొని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడు.అంతే కాకుండా ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారు.

కొత్త ఇంటిని చూసి కౌశల్ తండ్రి కూడా ఆనందం వ్యక్తం చేశారు.ఆ గృహప్రవేశం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు కొందరు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే కౌశల్ ప్రస్తుతం బీబీ జోడీలో అభినయశ్రీ తో జోడిగా తన పర్ఫామెన్స్ లను ఇరగదీస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube