Sobha Shetty : బిగ్ బాస్ షోలో ఆరోవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కానుందా.. ఎవరంటే? 

బిగ్ బాస్ కార్యక్రమానికి కాస్త గ్లామర్ టచ్ ఉండాలి అంటే తప్పకుండా హౌస్ లో అమ్మాయిలు ఉండాల్సిందే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ( Bigg Boss )నిర్వాహకులు ఈ ఎపిసోడ్ ప్రారంభంలోనే ఏడుగురు అమ్మాయిలను హౌస్ లోకి పంపించారు.ఇలా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్ళగా వారిలో ఏడుగురు కంటెస్టెంట్లు అమ్మాయిలు ఏడుగురు అబ్బాయిలు కావడం విశేషం అయితే ఈ కార్యక్రమం ప్రారంభమై ఐదు వారాలు పూర్తి అయ్యి ఆరవ వారం కొనసాగుతోంది మరొక రెండు రోజులలో ఆరవ వారం కూడా పూర్తి కానుంది.

 Bigg Boss Telugu Season 7 Sixth Week Elimination Details Inside-TeluguStop.com

అయితే బిగ్ బాస్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ఈ ఐదుగురు అమ్మాయిలే కావటం గమనార్హం.

Telugu Bigg Boss, Nagarjuna, Shobha Shetty, Subhashree, Tollywood-Movie

మొదటివారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.రెండవ వారం షకీలా, మూడవ వారం సింగర్ దామిని, నాలుగవ వారం రతిక ఐదవ వారం శుభశ్రీ( Subhashree ) నుంచి వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ కావడంతో హౌస్ లో గ్లామర్ షో పూర్తిగా తగ్గిపోయింది.దీంతో మరో ముగ్గురు అమ్మాయిలను హౌస్ లోకి పంపించారు వారిలో నయని పావని, పూజా మూర్తి,అశ్విని ఇలా ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లడంతో బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.

అయితే ఆరవ వారం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మాయి బయటకు రాబోతుందని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Telugu Bigg Boss, Nagarjuna, Shobha Shetty, Subhashree, Tollywood-Movie

ఆరవ వారంలో భాగంగా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు.ఇందులో అమర్ దీప్, ప్రిన్స్, టేస్టీ తేజ, శోభా శెట్టి, పూజ మూర్తి,అశ్విని, నయనిపావని.ఈ ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే ప్రిన్స్, అమర్ ఇప్పుడే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు కాదు.ఇక టేస్టీ తేజను హౌస్ నుంచి బయటకు పంపిస్తే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కనుక ఇతనిని కూడా బయటకు పంపించే అవకాశాలు లేవనే చెప్పాలి.

ఇక మిగిలినది నలుగురు అమ్మాయిలు మాత్రమే ఈ నలుగురిలో ఈ వారం మరొక కంటెస్టెంట్ బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.అయితే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం ఈ వారం హౌస్ నుంచి శోభా శెట్టి ( Sobha Shetty ) బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.

ఈవారం ఎలిమినేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube